19.9.26

పోటీ పరీక్షల ప్రత్యేకం: సెప్టెంబర్ 18, 2026 వర్తమాన అంశాలు (Daily Current Affairs)

Advertisemtnt



1. జనాభా & సామాజిక అంశాలు (Demographics & Social Issues)

  • భారతదేశంలో మొత్తం సంతానోత్పత్తి రేటు (TFR) చారిత్రక పతనం:

    • ప్రధాన అంశం: భారతదేశంలో మొత్తం సంతానోత్పత్తి రేటు (Total Fertility Rate - TFR) చరిత్రలోనే తొలిసారిగా 1.9 కి పడిపోయింది.

    • రిపోర్ట్ వివరాలు: కేంద్ర హోం మంత్రిత్వ శాఖ పరిధిలోని 'ఆఫీస్ ఆఫ్ ద రిజిస్ట్రార్ జనరల్ అండ్ సెన్సస్ కమిషనర్' విడుదల చేసిన శాంపుల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ (SRS) నివేదిక ద్వారా ఈ వివరాలు వెల్లడయ్యాయి.

    • పునరుత్పత్తి స్థాయి (Replacement Level): సాధారణంగా జనాభా స్థిరత్వానికి రీప్లేస్‌మెంట్ లెవెల్ 2.1 ఉండాలి. భారత్ TFR (1.9) ఈ స్థాయి కంటే కిందకు పడిపోవడం ఆందోళనకరమైన విషయం.

    • రీప్లేస్‌మెంట్ లెవెల్ 2.1 ఎందుకు ఉంటుంది?: ఒక దంపతులు (ఇద్దరు) మరణిస్తే వారి స్థానంలో ఇద్దరు పిల్లలు ఉండాలి. కానీ బాల్య దశలోనే కొందరు మరణించే అవకాశాలు ఉండటం వల్ల సమతుల్యత కోసం రీప్లేస్‌మెంట్ లెవెల్‌ను 2.1 గా నిర్ణయించారు.

    • రాష్ట్రాల వారిగా గణాంకాలు:

      • అత్యధిక TFR ఉన్న రాష్ట్రాలు: బీహార్ (2.9), ఉత్తరప్రదేశ్ (2.6), మధ్యప్రదేశ్ (2.4), రాజస్థాన్ (2.3).

      • అత్యల్ప TFR ఉన్న రాష్ట్రాలు: సిక్కిం (1.0), ఢిల్లీ (1.2), తమిళనాడు & పశ్చిమ బెంగాల్ (1.3).

      • తెలుగు రాష్ట్రాలు: ఆంధ్రప్రదేశ్ – 1.4, తెలంగాణ – 1.5.

    • ప్రపంచ సగటు: ప్రపంచంలో సగటు TFR 2.2 గా ఉంది. చైనా, జపాన్, రష్యా, బ్రెజిల్, అమెరికా, ఇరాన్ దేశాలు భారత్ కంటే తక్కువ TFR ను కలిగి ఉన్నాయి.

    • ప్రభావితమయ్యే ఆర్థిక రంగాలు:

      • TFR తగ్గడం వల్ల వర్కింగ్ పాపులేషన్ (డెమోగ్రాఫిక్ డివిడెండ్) తగ్గి, వృద్ధుల జనాభా పెరుగుతుంది. కార్మికుల కొరత ఏర్పడుతుంది.

      • సిల్వర్ ఎకానమీ (Silver Economy): సమాజంలోని వృద్ధుల అవసరాలకు తగిన ఆర్థిక కార్యకలాపాలు, ఉత్పత్తులు మరియు సేవలను అందించే ఆర్థిక వ్యవస్థను 'సిల్వర్ ఎకానమీ' లేదా 'వెండి ఆర్థిక వ్యవస్థ' అంటారు.

      • ఆరెంజ్ ఎకానమీ (Orange Economy): కంటెంట్ క్రియేటర్లు, రచయితలు, సంగీతకారులు, వీడియో గేమ్ డెవలపర్లు వంటి సృజనాత్మక ఆలోచనల (Creative Skills) ద్వారా ఆదాయం పొందే ఆర్థిక వ్యవస్థను 'ఆరెంజ్ ఎకానమీ' లేదా 'క్రియేటివ్ ఎకానమీ' అంటారు.

2. రాజ్యాంగం, పాలిటీ & న్యాయ వ్యవస్థ (Polity, Governance & Judiciary)

  • లడక్ కోసం ఆర్టికల్ 371K ప్రవేశపెట్టాలని హోం శాఖ ప్రతిపాదన:

    • నేపథ్యం: లడక్ ప్రాంతాన్ని రాజ్యాంగంలోని 6వ షెడ్యూల్‌లో చేర్చాలని సోనమ్ వాంగ్‌చుక్ నేతృత్వంలో పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగాయి.

    • ప్రతిపాదన: లడక్ కోసం రాజ్యాంగంలోని Part XXI లో ఆర్టికల్ 371K అనే ప్రత్యేక చాప్టర్‌ను చేర్చాలని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ప్రతిపాదించింది.

    • ఉద్దేశం: ఆర్టికల్ 371K ద్వారా లడక్‌లో ఎన్నుకోబడే ప్రత్యేక శాసన వ్యవస్థను (Elected Legislative Body) ఏర్పాటు చేయవచ్చు. ఇది లడక్‌లోని 90% కి పైగా ఉన్న గిరిజనుల భూమి, సంస్కృతి, భాష, అటవీ మరియు సహజ వనరుల హక్కులను కాపాడుతుంది. దీని ఆధారంగా 'స్వీ జెనరిస్' (Sui Generis) గవర్నెన్స్ మోడల్‌ను ఏర్పాటు చేస్తారు.

    • ముఖ్యమైన రాజ్యాంగ ఆర్టికల్స్:

      • 6వ షెడ్యూల్ & ఆర్టికల్ 244: ఈ షెడ్యూల్ ఈశాన్య రాష్ట్రాలైన అస్సాం, మేఘాలయ, త్రిపుర, మిజోరంలలోని గిరిజన ప్రాంతాల పరిపాలనకు (Autonomous District Councils) వర్తిస్తుంది.

      • ఆర్టికల్ 240: కేంద్రపాలిత ప్రాంతాల్లో (అండమాన్, లక్షద్వీప్, దాద్రా నగర్ హవేలీ మొదలైనవి) శాంతి, ప్రగతి కోసం రాష్ట్రపతి నిబంధనలు చేయవచ్చు.

      • ఆర్టికల్ 371E: ఆంధ్రప్రదేశ్‌లో సెంట్రల్ యూనివర్సిటీ ఏర్పాటుకు సంబంధించిన ప్రొవిజన్.

  • సుప్రీంకోర్టు – 'జన్ సూచనా సేవ' ప్రారంభం:

    • వివరాలు: సెప్టెంబర్ 14న హిందీ దివస్ సందర్భంగా సుప్రీంకోర్టు 53వ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ (హర్యానా) ఈ సేవను ప్రారంభించారు.

    • లక్ష్యం: క్లిష్టమైన సుప్రీంకోర్టు తీర్పులను సాధారణ ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో 15 నుండి 30 నిమిషాల ఆడియో, వీడియో వివరణల రూపంలో అందించడం.

    • హిందీ దివస్ నేపథ్యం: 1949 సెప్టెంబర్ 14న రాజ్యాంగ సభ హిందీని అధికార భాషగా గుర్తించింది. మొదటి హిందీ దివస్‌ను 1953 సెప్టెంబర్ 14న జరుపుకున్నారు (ఆర్టికల్ 343 హిందీ భాషా ప్రమోషన్ గురించి తెలుపుతుంది).

  • యుఎపిఎ (UAPA) కింద షహజాద్ భట్టీ నెట్వర్క్ పై నిషేధం:

    • పాకిస్తాన్ కేంద్రంగా పనిచేసే షహజాద్ భట్టీ నెట్వర్క్ ను అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ (UAPA), 1967 కింద కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నిషేధించింది.

    • UAPA సెక్షన్ 35 (1A) కింద ఈ సంస్థను మొదటి షెడ్యూల్‌లో 46వ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్‌గా చేర్చారు. సరిహద్దుల ద్వారా ఆయుధాలు, మాదకద్రవ్యాల అక్రమ రవాణా మరియు తీవ్రవాదానికి ప్రేరేపించడం వల్ల దీనిపై చర్యలు తీసుకున్నారు.

  • జనన మరణాల నమోదు చట్టం 2026: దేశవ్యాప్తంగా కఠిన నిబంధనలతో 2026 అక్టోబర్ 1 నుండి అమల్లోకి రానుంది.

3. రక్షణ రంగం (Defense Technology)

  • మ్యాన్ పోర్టబుల్ AUV ప్రయోగం విజయవంతం:

    • సంస్థ: డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (DRDO).

    • వేదిక: ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో ఉన్న నావెల్ సైన్స్ అండ్ టెక్నాలజికల్ లాబరేటరీ (NSTL) వద్ద దీనిని విజయవంతంగా పరీక్షించారు.

    • ప్రత్యేకత: ఇది ఒక 'మ్యాన్ పోర్టబుల్ అటానమస్ అండర్ వాటర్ వెహికల్' (ఒక రకమైన అండర్ వాటర్ రోబోటిక్ డ్రోన్).

    • ఉపయోగం: సముద్రంలో నీటి అడుగున ఉండే శత్రు దేశాల మందుపాత్రలు (Mines), క్షిపణులను అకాస్టిక్ సోనార్ (Acoustic Sonar) టెక్నాలజీ ద్వారా మానవ ప్రమేయం లేకుండా స్వయంచాలకంగా (Autonomously) గుర్తించి సమాచారం అందిస్తుంది.

4. పర్యావరణం, జీవవైవిధ్యం & వ్యవసాయం (Environment & Agriculture)

  • రైతులకు సాయిల్ కార్బన్ పేమెంట్స్ (Soil Carbon Payments):

    • భారతదేశంలో తొలిసారిగా సుస్థిర వ్యవసాయ పద్ధతులు (Sustainable Agriculture) పాటించిన పంజాబ్, హర్యానాకు చెందిన 2,500 మందికి పైగా రైతుల అకౌంట్లలో ₹2.9 కోట్లను Direct Benefit Transfer (DBT) ద్వారా జమ చేశారు.

    • ICAR డైరెక్టర్ జనరల్ ఎం.ఎల్. జాట్ దీనిని ప్రారంభించారు. 2019లో ICAR సహకారంతో 'గ్రో ఇండిగో' సంస్థ ప్రారంభించిన 'ఆది ఫార్మర్ కార్బన్ ప్రోగ్రామ్' (AADI) లో భాగంగా ఈ నిధులు ఇచ్చారు.

  • భారత్‌లో ప్రాజెక్ట్ చీతా – 52కి చేరిన సంఖ్య:

    • ప్రాజెక్ట్ చీతా ప్రారంభించి 4 ఏళ్లు పూర్తయిన సందర్భంగా నివేదిక వెలువడింది (2022 సెప్టెంబర్ 17న నమీబియా నుండి 8 చీతాలను తెచ్చి కునోలో ప్రవేశపెట్టారు).

    • ప్రస్తుతం భారత్‌లో మొత్తం చీతాల సంఖ్య 52. వీటిలో 32 చీతాలు భారత గడ్డపైనే జన్మించాయి.

    • స్థానాలు: కునో నేషనల్ పార్క్ (మధ్యప్రదేశ్) లో 49, గాంధీ సాగర్ వైల్డ్‌లైఫ్ శాంక్చురీ (మధ్యప్రదేశ్) లో 3 ఉన్నాయి.

    • శాస్త్రీయ నామాలు:

      • చీతా శాస్త్రీయ నామం: Acinonyx jubatus

      • ఆసియా చీతా: Acinonyx jubatus venaticus (IUCN Status: Critically Endangered)

      • ఆఫ్రికన్ చీతా: Acinonyx jubatus jubatus (IUCN Status: Vulnerable)

  • ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఫ్లవర్ ఫీల్డ్స్ (లడక్):

    • లడక్ లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా లే (Leh) లోని షోగ్లంసర్ / స్టక్నా వద్ద 10,600 అడుగుల ఎత్తులో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఫ్లవర్ ఫీల్డ్స్‌ను ప్రారంభించారు.

    • ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినం (సెప్టెంబర్ 17 - సేవా దివస్) సందర్భంగా 40 ఎకరాల్లో 25 లక్షలకు పైగా పుష్పాలతో దీనిని ఏర్పాటు చేశారు.

  • మిజోరంలో కొత్త కప్ప జాతులు:

    • మిజోరం రాష్ట్రంలో పరిశోధకులు రెండు కొత్త కప్ప జాతులను కనుగొన్నారు:

      1. ఇంగెరాణ ఐజ్వాల్ (Ingerana aizwal)

      2. దత్తాఫ్రైనస్ ఫాంగ్ఫుయి (Duttaphrynus phawngpui – ఫాంగ్ఫుయి మిజోరంలో ఎత్తైన శిఖరం).

  • కేరళ తీరంలో కొత్త చేప జాతి:

    • ICAR-CMFRI (కొచ్చి) శాస్త్రవేత్తలు కేరళలోని కొల్లాం తీరంలో 300 మీటర్ల లోతులో అరియోజోమా సిఎమ్‌ఎఫ్ఆర్ఐఎన్సిస్ (Ariosoma cmfriense) అనే కొత్త కంగర్ ఈల్ (Conger Eel) చేప జాతిని కనుగొన్నారు.

  • కొర్రల జన్యువుతో అనావృష్టిని తట్టుకునే వరి రకాలు:

    • యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ (UoH) ప్లాంట్ సైన్సెస్ పరిశోధకులు (డాక్టర్ ఎం. ముతమిల రసన్ నేతృత్వంలో) కొర్రలలో (Setaria italica) ఉండే కరువును/అనావృష్టిని తట్టుకునే జన్యువును 'పూసా బాస్మతి', 'సోనామసూరి', 'IR 64' వరి రకాలలోకి ప్రవేశపెట్టి కొత్త వంగడాలను అభివృద్ధి చేశారు. కేంద్ర ప్రభుత్వం దీనికి ₹80 లక్షల సాయం అందించింది.

  • స్వచ్ఛతా హి సేవ 2026: దేశవ్యాప్తంగా పారిశుధ్య ప్రచారం ప్రారంభమైంది.

5. అంతర్జాతీయ సంబంధాలు & ఒప్పందాలు (International Relations & Trade)

  • అమెరికా 'రష్యా-ఇరాన్ ఆంక్షల బిల్లు 2026':

    • యూఎస్ కాంగ్రెస్ 'Lindsey O. Graham Sanctioning Russia and Iran Act 2026' బిల్లును ఆమోదించింది.

    • ముఖ్యాంశం: రష్యా నుండి క్రూడ్ ఆయిల్/ఇంధనాన్ని కొనుగోలు చేసే మొదటి 5 దేశాలపై (భారత్, చైనా సహా) 100% వరకు టారిఫ్‌లు (సుంకాలు) విధించే అధికారం అమెరికా అధ్యక్షుడికి లభిస్తుంది.

  • ఆర్టెమిస్ అక్కార్డ్స్ (Artemis Accords) లో 72వ దేశంగా జిబౌటి:

    • నాసా (NASA) ఆధ్వర్యంలో సురక్షిత అంతరిక్ష పరిశోధనల కోసం ఏర్పడిన 'ఆర్టెమిస్ అక్కార్డ్స్' పై సంతకం చేసి జిబౌటి (Djibouti) 72వ సభ్య దేశంగా (ఆఫ్రికా నుండి 8వ దేశం) చేరింది.

    • 71వ దేశంగా తుర్కియే చేరింది. భారత్ 2023 జూన్ లో ఈ ఒప్పందంపై సంతకం చేసింది.

  • భారత్ - న్యూజిలాండ్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ (FTA):

    • భారత్ - న్యూజిలాండ్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందానికి న్యూజిలాండ్ పార్లమెంట్ ఆమోదం తెలిపింది. వచ్చే 5 ఏళ్లలో ద్విపాక్షిక వాణిజ్యాన్ని 5 బిలియన్ డాలర్లకు పెంచడం దీని లక్ష్యం (న్యూజిలాండ్ పిఎమ్: క్రిస్టోఫర్ లక్సన్, క్యాపిటల్: వెల్లింగ్టన్).

  • ఇతర అంతర్జాతీయ కూటముల్లో నూతన సభ్యులు:

    • NATO (32): 31వది ఫిన్లాండ్, 32వది స్వీడన్.

    • IMF (191): 191వ సభ్య దేశం లీచ్‌స్టెన్ (Liechtenstein).

    • WTO (166): 165వది కామోరోస్, 166వది తైమోర్ లెస్టే (Timor-Leste).

6. రాష్ట్రాల వ్యాప్త ముఖ్యాంశాలు (Andhra Pradesh & Regional Updates)

  • ఆంధ్రప్రదేశ్ – 'ఏపీ ఫస్ట్' (AP FIRST) శాఖ మార్పు:

    • 'ఆంధ్రప్రదేశ్ ఫ్యూచర్ ఇన్నోవేషన్ రీసెర్చ్ సైన్స్ అండ్ టెక్నాలజీ' (AP FIRST) ని అటవీ-పర్యావరణ శాఖ నుండి సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్నోవేషన్ శాఖ పరిధిలోకి మారుస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

  • ఆంధ్రప్రదేశ్ కు 'సాస్కీ' (SASKI) నిధులు:

    • రాష్ట్రాల్లో మూలధన వ్యయం (Capital Expenditure) మరియు ఆస్తుల కల్పన కోసం కేంద్రం ఇచ్చే 50 ఏళ్ల వడ్డీ లేని రుణ పథకం SASKI (Special Assistance to States for Capital Investment) కింద 2026-27 ఆర్థిక సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్‌కు ₹8,226 కోట్లు కేటాయించబడ్డాయి.

  • కేరళ – 'హజార్డ్ పర్సెప్షన్ టెస్ట్ (HPT)':

    • డ్రైవింగ్ లైసెన్స్ దరఖాస్తుదారులకు కంప్యూటర్ ఆధారిత 'హజార్డ్ పర్సెప్షన్ టెస్ట్' (HPT) ను తప్పనిసరి చేయనున్న మొదటి రాష్ట్రంగా కేరళ నిలవనుంది (డిసెంబర్ 2026 నుండి అమలు). ప్రమాదాలు జరిగే అవకాశాలను ముందస్తుగా అంచనా వేసే డ్రైవర్ సామర్థ్యాన్ని ఇది పరీక్షిస్తుంది.

7. ర్యాంకింగ్స్, బిజినెస్ & క్రీడలు (Rankings, Business & Sports)

  • QS MBA ర్యాంకింగ్స్ 2027:

    • గ్లోబల్ టాప్ 3: MIT స్లోన్ (#1), హార్వర్డ్ బిజినెస్ స్కూల్ (#2), స్టాన్‌ఫోర్డ్ (#3).

    • భారత్ నుండి టాప్ 100 లో ఐఐఎంలు: IIM బెంగళూరు (#64), IIM అహ్మదాబాద్ (#70), IIM కలకత్తా (#95).

  • ఆసియాలోనే అత్యంత సంపన్నుడిగా జాంగ్ ఇమింగ్:

    • బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ నివేదిక ప్రకారం టిక్‌టాక్ మాతృసంస్థ 'బైట్‌డాన్స్' ఫౌండర్ జాంగ్ ఇమింగ్ ($105 బిలియన్ల కంటే ఎక్కువ సంపదతో) గౌతమ్ అదానీని వెనక్కి నెట్టి ఆసియాలోనే అత్యంత సంపన్నుడిగా (Asia's Richest Person) నిలిచాడు.

  • అత్యంత వేగవంతమైన T20I సెంచరీ (అభిషేక్ శర్మ):

    • భారత ఓపెనర్ అభిషేక్ శర్మ (పంజాబ్) న్యూఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ఆఫ్ఘనిస్తాన్‌పై కేవలం 30 బంతుల్లోనే సెంచరీ సాధించి రోహిత్ శర్మ (35 బంతులు) భారత రికార్డును అధిగమించాడు.

  • ఆర్థర్ ఎం బ్యూచే అవార్డు (2026):

    • యూఎస్ నేషనల్ అకాడమీ ఆఫ్ ఇంజనీరింగ్ ప్రకటించే ప్రతిష్టాత్మక 'ఆర్థర్ ఎం బ్యూచే అవార్డు' కు మాజీ NSF డైరెక్టర్ సేతురామన్ పంచనాథన్ ఎంపికయ్యారు. ఈ అవార్డు పొందిన తొలి ఇండో-అమెరికన్ ఈయనే.

  • నాడా (NADA) లైఫ్‌టైమ్ బ్యాన్:

    • డోపింగ్ ఉల్లంఘనల కారణంగా అథ్లెటిక్స్ కోచ్ రాకేష్ కుమార్ పై నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ (NADA) జీవితకాల నిషేధం విధించింది.





Daily Current Affairs Practice Quiz – 18 September 2026


Q1. ఇటీవల విడుదలైన 'శాంపుల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ (SRS)' నివేదిక ప్రకారం భారతదేశంలో మొత్తం సంతానోత్పత్తి రేటు (Total Fertility Rate - TFR) ఎంతకు పడిపోయింది?

(A) 2.1

(B) 1.9

(C) 1.7

(D) 2.2

Q2. లడక్‌లో ప్రజలచే ఎన్నుకోబడే ప్రత్యేక శాసన వ్యవస్థ (Elected Legislative Body) ఏర్పాటు కోసం రాజ్యాంగంలో ఏ ఆర్టికల్‌ను ప్రవేశపెట్టాలని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ప్రతిపాదించింది?

(A) ఆర్టికల్ 371A

(B) ఆర్టికల్ 370

(C) ఆర్టికల్ 371K

(D) ఆర్టికల్ 244

Q3. సుప్రీంకోర్టు తీర్పులను సాధారణ ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో ఆడియో/వీడియో వివరణల రూపంలో అందించడానికి ప్రారంభించిన సేవ ఏది?

(A) సుప్రీం సమాచార్

(B) జన్ సూచనా సేవ

(C) న్యాయ సమాచార్

(D) జన్ న్యాయ్ సేవా

Q4. డ్రైవింగ్ లైసెన్స్ దరఖాస్తుదారులకు కంప్యూటర్ ఆధారిత 'హజార్డ్ పర్సెప్షన్ టెస్ట్ (HPT)' ని తప్పనిసరి చేయనున్న భారతదేశపు తొలి రాష్ట్రం ఏది?

(A) ఆంధ్రప్రదేశ్

(B) కేరళ

(C) తమిళనాడు

(D) కర్ణాటక

Q5. DRDO అభివృద్ధి చేసిన 'మ్యాన్ పోర్టబుల్ అటానమస్ అండర్ వాటర్ వెహికల్ (AUV)' ప్రయోగాన్ని ఆంధ్రప్రదేశ్‌లోని ఏ నగరంలో విజయవంతంగా నిర్వహించారు?

(A) కాకినాడ

(B) మచిలీపట్నం

(C) విశాఖపట్నం

(D) తిరుపతి

Q6. భారత్‌లో 'ప్రాజెక్ట్ చీతా' ప్రారంభించి 4 ఏళ్లు పూర్తయిన సందర్భంగా వెల్లడించిన గణాంకాల ప్రకారం ప్రస్తుతం దేశంలో మొత్తం చీతాల సంఖ్య ఎంత?

(A) 32

(B) 49

(C) 52

(D) 60

Q7. ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినం (సేవా దివస్) సందర్భంగా ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన (10,600 అడుగుల ఎత్తులో) ఫ్లవర్ ఫీల్డ్స్‌ను ఎక్కడ ప్రారంభించారు?

(A) శ్రీనగర్ (జమ్మూ & కాశ్మీర్)

(B) లే (లడక్)

(C) షిమ్లా (హిమాచల్ ప్రదేశ్)

(D) గ్యాంగ్‌టక్ (సిక్కిం)

Q8. సుస్థిర వ్యవసాయ పద్ధతులు పాటించిన రైతులకు భారత్‌లోనే తొలిసారిగా నేరుగా (DBT ద్వారా) నేల కార్బన్ చెల్లింపులు (Soil Carbon Payments) ఏ రాష్ట్రాల్లో అందించారు?

(A) ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ

(B) పంజాబ్ & హర్యానా

(C) గుజరాత్ & రాజస్థాన్

(D) బీహార్ & ఉత్తరప్రదేశ్

Q9. అరేబియా సముద్రంలో కేరళ కొల్లాం తీరం సమీపంలో ICAR-CMFRI శాస్త్రవేత్తలు కనుగొన్న 'అరియోజోమా సిఎమ్‌ఎఫ్ఆర్ఐఎన్సిస్' (Ariosoma cmfriense) అనేది దేనికి సంబంధించిన కొత్త జాతి?

(A) కప్ప

(B) కంగర్ ఈల్ చేప

(C) పీత

(D) సముద్ర పాము

Q10. అమెరికాకు చెందిన 'నాసా' నేతృత్వంలోని ఆర్టెమిస్ అక్కార్డ్స్ (Artemis Accords) లో చేరిన 72వ సభ్య దేశంగా ఏది నిలిచింది?

(A) తుర్కియే

(B) జిబౌటి

(C) ఈజిప్ట్

(D) బ్రెజిల్

Q11. యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ (UoH) పరిశోధకులు కరువును/అనావృష్టిని తట్టుకునే ఏ చిరుధాన్యం (Millet) యొక్క జన్యువును వరి వంగడాలలోకి ప్రవేశపెట్టారు?

(A) రాగులు

(B) కొర్రలు

(C) సామలు

(D) జొన్నలు

Q12. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 'ఏపీ ఫస్ట్' (AP FIRST) సంస్థను అటవీ-పర్యావరణ శాఖ పరిధి నుండి ఏ శాఖ పరిధిలోకి మారుస్తూ నిర్ణయం తీసుకుంది?

(A) ఆర్థిక శాఖ

(B) సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్నోవేషన్ శాఖ

(C) పరిశ్రమల శాఖ

(D) విద్యా శాఖ

Q13. 'QS MBA ర్యాంకింగ్స్ 2027' ప్రకారం గ్లోబల్ టాప్ 100 లో చోటు దక్కించుకున్న భారతీయ విద్యాసంస్థల్లో అగ్రస్థానంలో నిలిచింది ఏది?

(A) IIM అహ్మదాబాద్ (#70)

(B) IIM కలకత్తా (#95)

(C) IIM బెంగళూరు (#64)

(D) ISB హైదరాబాద్

Q14. బ్లూమ్‌బెర్గ్ నివేదిక ప్రకారం గౌతమ్ అదానీని వెనక్కి నెట్టి ఆసియాలోనే అత్యంత సంపన్నుడిగా (Asia's Richest Person) నిలిచిన టిక్‌టాక్ మాతృసంస్థ 'బైట్‌డాన్స్' ఫౌండర్ ఎవరు?

(A) మా యున్ (జాక్ మా)

(B) జాంగ్ ఇమింగ్

(C) మా హువాతెంగ్

(D) లీ జున్

Q15. భారత క్రికెట్ జట్టు తరపున అంతర్జాతీయ T20లలో అత్యంత వేగవంతమైన సెంచరీ (30 బంతుల్లో) సాధించి రోహిత్ శర్మ రికార్డును అధిగమించిన ఆటగాడు ఎవరు?

(A) సూర్యకుమార్ యాదవ్

(B) తిలక్ వర్మ

(C) అభిషేక్ శర్మ

(D) యశస్వి జైస్వాల్

సమాధానాల కీ (Answers Key & Brief Explanations)

  1. (B) 1.9 — (భారతదేశ TFR పునరుత్పత్తి స్థాయి 2.1 కంటే తక్కువగా 1.9 కి పడిపోకSRS నివేదిక ద్వారా వెల్లడైంది.)

  2. (C) ఆర్టికల్ 371K — (లడక్ ప్రత్యేక అధికారాలు, ఎన్నుకోబడే లెజిస్లేటివ్ బాడీ కోసం కేంద్రం ప్రతిపాదించింది.)

  3. (B) జన్ సూచనా సేవ — (హిందీ దివస్ సందర్భంగా CJI జస్టిస్ సూర్యకాంత్ ఈ సేవను ప్రారంభించారు.)

  4. (B) కేరళ — (డ్రైవర్లలో ప్రమాదాలను ముందస్తుగా అంచనా వేసే సామర్థ్యాన్ని HPT ద్వారా పరీక్షిస్తారు.)

  5. (C) విశాఖపట్నం — (విశాఖలోని NSTL నావల్ లాబరేటరీ వేదికగా DRDO సక్సెస్ఫుల్ ప్రయోగం చేసింది.)

  6. (C) 52 — (భారత్‌లో మొత్తం చీతాలు 52; వీటిలో 32 భారత గడ్డపైనే జన్మించాయి.)

  7. (B) లే (లడక్) — (లడక్ లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా లే లో దీనిని ప్రారంభించారు.)

  8. (B) పంజాబ్ & హర్యానా — (AADI ప్రోగ్రామ్ కింద ₹2.9 కోట్లు DBT ద్వారా రైతులకు అందించారు.)

  9. (B) కంగర్ ఈల్ చేప — (ICAR-CMFRI కొచ్చి శాస్త్రవేత్తలు కొల్లాం కోస్ట్‌లో దీనిని గుర్తించారు.)

  10. (B) జిబౌటి — (సురక్షిత అంతరిక్ష పరిశోధన ఒప్పందంలో జిబౌటి 72వ సిగ్నేటరీగా చేరింది.)

  11. (B) కొర్రలు — ('సెటారియా ఇటాలికా' జన్యువును పూసా బాస్మతి వంటి వరి రకాల్లో ప్రవేశపెట్టారు.)

  12. (B) సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్నోవేషన్ శాఖ — (కార్యకలాపాల సమర్థ నిర్వహణ కోసం శాఖను మార్చారు.)

  13. (C) IIM బెంగళూరు (#64) — (ప్రపంచ టాప్ 100 లో భారత్ నుండి 3 IIMలు నిలిచాయి).

  14. (B) జాంగ్ ఇమింగ్ — ($105 బిలియన్ల సంపదతో ఆసియాలోనే రిచెస్ట్ పర్సన్‌గా నిలిచాడు.)

  15. (C) అభిషేక్ శర్మ — (ఆఫ్ఘనిస్తాన్‌పై 30 బంతుల్లోనే సెంచరీ చేసి కొత్త రికార్డు సృష్టించాడు.)













Advertisemtnt

0comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.

Results / Notifications / Timetables

Advertisement

Notifications

More

Latest Results

More

AP History tutorial

More

APPSC / TSPSC Exams Info

History
AP
TS
Geography
TS
Economy
AP
TS
Polity
AP
TS
Environment
AP
TS
Disaster Mng
AP
TS
Current Affiers
AP
TS
Bifercation
AP
TS

current affairs

More

AP Geography

More
Top