2.5.19

KRUCET 2019: Last date to apply without late fee extended up to 07-05-2019

Advertisemtnt
కృష్ణా యూనివర్సిటీ మచిలీపట్నం, కృష్ణా యూనివర్సిటీ డా:యం.ఆర్..ఆర్ పీజి  సెంటర్ నూజివీడు మరియు విశ్వవిధ్యాలయ అనుబంద కళాశాలలలో పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సులలొ ప్రవేశాలకు సంబందించి కృష్ణా యునివర్సిటి పీజి సెట్ 2019 (KRUCET-2019) ద్వారా ధరకాస్తులు స్వీకరణకు ఎటువంటి అపరాధ రుసుము లేకుండా చివరి తేదీ 30.04.2019 తేదీగా మరియు రూ.250/- అపరాధ రుసుముతో 05.05.2018 తేదీ వరకు  ధరఖాస్తులను స్వీకరించుటకు గడువు తేదీగా నిర్ణయించిన సంగతి తెలిసిందే.  వివిధ కళాశాలల విధ్యార్ధినీ, విధ్యార్ధుల అభ్యర్ధనల మేరకు కె.ఆర్.యు.సెట్ 2019 అప్లికేషన్ గడువు తేదీని ఎటువంటి అపరాధ రుసుము లేకుండా 07.05.2019 తేదీ వరకు మరియు అపరాధ రుసుము రు.250/- తో కలిపి 10.05.2019 వ తేదీ వరకు పొడిగించినట్లు అడ్మిషన్స్ సంచాలకులు ప్రొఫెసర్. యం.వి. బసవేశ్వరరావు తెలిపారు. ఇప్పటి వరకు సుమారుగ 3,500 మందికి పైగా విధ్యార్ధినీ,విధ్యార్ధులు ప్రవేశ పరీక్షలు వ్రాయడము కొరకు వారి అభ్యర్ధిత్వాన్ని నమోదు చేసుకున్నారు.    అవకాశాన్ని మిగిలిన విధ్యార్ధినీ,విధ్యార్ధులు కూడా సద్వినియూగం చేసుకోవాలని విశ్వవిద్యాలయ కె.ఆర్.యు.సెట్ - 2019 కన్వీనర్ కోరారు. అడ్మిషన్లు కొరకు నిర్వహించు ప్రవేశ పరీక్షలను మే  13 నుండి 16 తేదీలలో నిర్వహించుటకు ఉత్తర్వులు జారీచేసినట్లు అడ్మిషన్స్ డైరక్టర్ ప్రొఫెసర్. యం.వి. బసవేశ్వరరావు తెలిపారు.    
             
              అలాగే అడ్మిషన్  విభాగపు ఆధ్వర్యంలో మరో సాంకేతిక అంశంలో మెరుగులు దిద్దుకొని ముందడుగు వేస్తూ విద్యార్థినీ, విద్యార్థుల సౌలభ్యం కొరకు “KRUCET -  2019  అనే మొబైల్  యాప్” ను రూపొందించినట్లు  విశ్వవిద్యాలయ  అడ్మిషన్స్  సంచాలకులు ప్రొఫెసర్. యం.వి. బసవేశ్వరరావు తెలిపారు. ఈ విధానం ద్వారా విద్యార్థినీ, విద్యార్థులు వారు నమోదు చేసుకొన్నమొబైల్ నెంబరు తో అడ్మిషన్ వివరాలను తేలికగా పొందవచ్చునని తెలిపారు. అలాగే విద్యార్థులకు వారి యొక్క అప్లికేషన్ యొక్క సమాచారం, ఫీజు చెల్లింపులు, హాల్ టికెట్లు డౌన్లోడింగ్, పరీక్షా తేదీ, వారి యొక్క ర్యాంకు వివరాలు మరియు వారు అడ్మిషన్ పొందిన కోర్సులు మరియు కాలేజీల సమాచారం మొత్తం కూడా ఈ యొక్క మొబైల్ యాప్ ద్వారా ఎప్పటికపుడు పొందవచ్చును. ఈ మొబైల్ యాప్ ను గూగుల్ ప్లేస్టోర్ నుంచి డౌన్ లోడ్ చేసికొని ముందుగా మీరు మీ అప్లికేషన్ నెంబరును యూజర్ నేమ్ లో నమోదు చేసి, మీ పుట్టిన తేదీని పాస్వర్డ్ గా నమోదు చేసి పూర్తి వివరాలను పొందవచ్చును.
Advertisemtnt

0 comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.

Results / Notifications / Timetables

Advertisement

Notifications

More

Latest Results

More

JNTU Fast Updates

More

AP / TS CETS Exams Info

Ed.CET
AP
TS
ECET
TS
EAMCET
AP
TS
ICT
AP
TS
LAWCET
AP
TS
PGLAWCET
AP
TS
PECET
AP
TS
PGECET
AP
TS
LPCET
AP
TS
POLYCET
AP
TS
SET

Hall tickets

More

Previous Question Papers

More
Top